ప్రేరణని ఏడ్పించేసిన పృథ్వీ.. కారణం ఎవరంటే!
on Oct 15, 2024
బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ ఫుల్ హాట్ గా జరిగాయి. దీనిలో గంగవ్వ నామినేషన్ హైలైట్ గా నిలిచింది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.
నామినేషన్స్‌లో భాగంగా టేస్టీ తేజను నిఖిల్ నామినేట్ చేసి పర్ఫామెన్స్ తగ్గిపోయిందంటూ చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ. అసలు ఇన్ని రోజుల్లో నన్ను పలకరించుడే లేదు.. మాట్లాడుడు లేదు.. బీబీ టాస్కులో కూడా నువ్వు బాగా ఆడలే.. సైలెంట్‌గా కూసుంటావ్.. ఉఫ్ (సిగరెట్) అంటూ ఊదుకుంటూ ఉంటావ్.. ఏం ఆడలే నువ్వు అంటూ గంగవ్వ అంది. నేను వంద శాతం ఇచ్చినా.. అన్నీ చేశా అంటూ పృథ్వీ చెబితే పనులు కూడా చేయలేవ్.. నాకు నచ్చలేదని నామినేట్ చేస్తున్నానంటూ గంగవ్వ చెప్పింది. ఇక నిఖిల్, గంగవ్వల నామినేషన్స్‌లో ఒకరిదే తీసుకోవాలి కనుక ప్రేరణ డెసిషన్ తీసుకుంది. ఇద్దరి పాయింట్లు దగ్గరి దగ్గర ఒక్కటే ఆల్ మోస్ట్.. కానీ గంగవ్వ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే నాకు కూడా బీబీ హోటల్ టాస్కులో పృథ్వీ పర్ఫామెన్స్ తక్కువ అనిపించింది.. నువ్వు అందరితో మాట్లాడొచ్చు. ఆ టాస్కులో కానీ మాట్లాడలేదనిపించిందంటూ ప్రేరణ చెప్పింది. ఇంతలో సంబంధం లేకపోయినా మధ్యలో దూరిపోయి నయని మాట్లాడబోయింది. దీంతో గంగవ్వ.. నయని నువ్వు ఆగు అంటూ గంగవ్వ సీరియస్ అయింది. నేను మహారాణిని నా దగ్గరకే పృథ్వీ రాలేదంటూ గంగవ్వ అంటే నేను మీ అసిస్టెంట్ (నయని) దగ్గరికొచ్చా అంటూ పృథ్వీ చెప్పాడు. దీంతో అది నా దగ్గరికే సరిగ్గా రాలేదు.. అది నాకు అసిస్టెంటా.. నీ (నయని) తిరుగుడు పాడుకాను.. నా దగ్గరే లేవు నువ్వు అంటు గంగవ్వ అంది.
దీంతో మరోసారి ప్రేరణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అవ్వ పాయింట్ నువ్వు పనిలో కనిపించలేదు అన్నారు..నా పాయింట్ నువ్వు పని చేశావ్.. అందుకే ఆ పాయింట్లో నేను వెళ్లడం లేదు.. తేజ విషయానికొస్తే ఆయనకి హెల్త్ పాడైంది.. అందుకే పర్ఫామెన్స్ లో అయింది అనే ఉద్దేశంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఆయన్ను వదిలేస్తున్నానంటూ ప్రేరణ చెప్పింది. దీంతో నాకు కూడా ఫీవర్ ఉంది ఈరోజు.. నేను చెప్తానా.. చెప్పనా అనేదే పాయింట్ అంటూ పృథ్వీ వాదించాడు. ఇలా కాసేపు డిస్కషన్ నడవడంతో పోని ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలో హౌస్‌నే అడుగుదామంటూ ప్రేరణ అంది. కానీ దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. హ్యాట్ ఎవరి దగ్గర ఉందో వాళ్లదే పవర్.. నువ్వే డిసైడ్ చెయ్ అనడంతో చివరికి పృథ్వీనే నామినేట్ చేసింది ప్రేరణ. ఇక ఆ తర్వాత పృథ్వీ దగ్గరికి యష్మీ వెళ్ళి ప్రేరణ మీద ఉన్న కోపాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ఆ తర్వాత పృథ్వీకి నిఖిల్ ఏదో చెప్పే ప్రయత్నం చేయగా.. తను కావాలనే నన్ను టార్గెట్ చేసింది. నేను తనని వదిలిపెట్టనని పృథ్వీ అన్నాడు. ఆ తర్వాత బజర్ మోగగానే పృథ్వీ హ్యాట్ ని పట్టుకున్నాడు. ఇక హ్యాట్ కోసం నయని, హరితేజ, ప్రేరణ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నచగా.. ప్రేరణకి ఇవ్వకుండా హరితేజ తీసుకునేలా పృథ్వీ చేశాడు. దాంతో ప్రేరణ ఏడ్చేసింది.
Also Read